జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రసాదాల ధరలు పెరిగాయి. దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ కొత్త ధరలను నేడు అనగా, సెప్టెంబర్ 10వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, లడ్డూ ప్రసాదం టికెట్ ధర రూ.20 నుండి రూ.25కు పెరిగింది. ఇప్పటి వరకు 80 గ్రాముల లడ్డూ ఇస్తుండగా, ఇకపై 100 గ్రాములు అందించనున్నారు. పులిహోర ప్రసాదం ధర రూ.15 నుండి రూ.20కు పెరిగింది. అయితే పులిహోర క్వాంటిటీ యథాతథంగా 200 గ్రాములుగానే కొనసాగుతుంది.ప్రసాదాల ధరల పెంపు దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం తీసుకున్న నిర్ణయమని దేవస్థానం అధికారులు తెలిపారు.