జాతీయ యోగా పోటీలకు నాగ కార్తీక్ ఎంపిక,రాష్ట్రస్థాయి యోగా పోటీలలో U-14 to16 విభాగంలో 5వ స్థానం సాధించిన పాణ్యం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నాగ కార్తీక్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ద్వారకాతిరుమలలో జరిగిన పోటీలో ప్రతిభ చూపిన కార్తీకన్ను పాఠశాల హెచ్ఎం రాములు నాయక్, యోగా మాస్టారు ప్రతాపరెడ్డి సోమవారం అభినందించారు.