స్మార్ట్ మీటర్లు వద్దు ట్రూప్ అప్ ఛార్జీలు రద్దు చేయాలంటూ శ్రీకాకుళం నగరంలోని ఈపిడిసిఎల్ ఎస్.సి. కార్యాలయం వద్ద వామపక్ష నాయకులు ధర్నా చేశారు.. ప్రభుత్వం వెంటనే వీటిని రద్దు చేయాలంటూ ప్లకార్డు ప్రదర్శన చేస్తూ నినాదాలు చేశారు. వీటిని రద్దు చేయకపోతే ఉద్యమించక తప్పదన్నారు.. ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహంకు గురికాక తప్పదంటూ హెచ్చరించారు.. ఎన్నికల ముందు వీటిని రద్దు చేస్తామన్న టిడిపి నేడు దాన్ని విషయం మరచిపోయి.. ఇంటింటికి అదాని మనుషుల ద్వారా స్మార్ట్ మీటర్లు బిగింస్తున్నారని ఆరోపించారు.. పీక్ సీజన్ అని భారాలు మోపుతున్నారని వాపోయారు.