వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా సాంకేతిక పరంగా వినియోగదారులకు సౌకర్యంగా ఉండే విధంగా TGNPDCL యాప్ ను రూపొందించడం జరిగిందని , 20 ఫీచర్లతో TGNPDCL యాప్ ఉందని జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం అన్నారు . మొదట వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లో ప్లేస్టోర్ లో TGNPDCL అని టైపు చేసి డౌన్ లోడ్ చేసుకొని సేవలు పొందగలరని కోరుతున్నామన్నారు . ఇందులో 1) రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ : ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన ఇందులో GPS లొకేషన్ ద్వారా వినియోగదారుని ఫోన్ లోని కెమెరా నుండి ఆ సంఘటను ఫోటో తీసి పంపవచ్చు .