సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని పలువురు ఉపాధ్యాయులను మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఘనంగా సత్కరించారు. పట్టణంలోని మాజీమంత్రి చంద్రశేఖర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.