అధిక వర్షపాతంతో పంట పొలాల్లోకి నీరు చేరి పంట నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం 12 గంటలకు కర్నూలు నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని ఆలూరు ఆస్పరి దేవనకొండ మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో రైతులు తీవ్ర ఇక్కడ ఎదుర్కొంటున్నారని ఈ నేపథ్యంలో పత్తి మొక్కజొన్న పంటలు నీట మునిగి పంట నష్టం వాటిల్లని ఆయన వెల్లడించారు.