గుండెపోటుతో బిజెపి నాయకులు మృతి వేంపేట్ లో విషాదం మెట్ పల్లి మండలం వేంపేట గ్రామ మాజీ సర్పంచ్, న్యాయవాది బిజెపి సీనియర్ నాయకులు మారంపల్లి శ్రీనివాస్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మారంపల్లి శ్రీనివాస్ (52)తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దైవదర్శనానికి వెళ్ళారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల మెట్ పల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సంతాపం వెలుబుచ్చారు. బిజెపి రాష్ట్ర నాయకులు, స్థానిక వైద్యులు డాక్టర్ చిట్నేని రఘు తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు