ఆలూరు మండలం పరిధిలోని మనేకుర్తి గ్రామంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన కనకదాసు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఆలూరు అంబేద్కర్ విగ్రహం నందు కురువ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆలూరు ఎస్ఐ మహబూబ్ బాషాకు వినతిపత్రం అందజేశారు.