తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు స్వర్గీయ చాకలి ఐలమ్మ 41 వర్ధంతి సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గం లో అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. బుధవారం 10 .15 నిమిషాలకు బాన్సువాడ లో నీ తాడ్కోల్ చౌరస్తాలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు సబ్ కలెక్టర్ కిరణ్మయి రజక సంఘం నాయకులు వర్ధంతి లో పాల్గొన్నారు.