నల్లగొండ జిల్లా దేవరకొండ లోని బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం మంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు సుధాకర్ శేఖర్ మాట్లాడుతూ ఇటీవల నల్గొండ పట్టణంలోని గణేష్ నిమజ్జనం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన రాజకీయ ప్రసంగాన్ని ప్రశ్నించిన బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి తో పాటు బిజెపి నాయకులును అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బిజెపి నాయకులు అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్ధం చేసేమని తెలిపారు. అక్రమ కేసులతో తమ పోరాటాలను ఆపలేరని అన్నారు.