రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులు పనిచేయాలి: MLA వెనిగండ్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు బాధ్యతతో పనిచేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. స్తానిక నందివాడలో శిథిలావస్థకు చేరిన నెహ్రాలి డ్రెయిన్ కల్వర్టు ఆదివారం మద్యాహ్నం 12 గంటల సమయంలో కుప్పకూలడంతో సాగునీటి సమస్యలు ఎదురవుతాయేమోనని రైతులు ఆందోళన చెందారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే కూలిపోయిన అ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారికి సూచించారు.