సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండలం బర్దిపూర్ దత్తగిరీ క్షేత్రంలో శని అమావాస్య సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ కవితా దేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తి శనీశ్వర స్వామికి తైలాభిషేకం నిర్వహించి ,నల్ల నువ్వులు, నల్ల వస్త్రం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్ న్యాయమూర్తిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.