సంగారెడ్డి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సిపిఐ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.