చింతూరు డివిజన్ లో ఎటపాక మండలంలో బొజ్జిగుప్ప గ్రామానికి చెందిన జూనియర్ లైన్మెన్ నాగార్జున వెంకట్ రెడ్డి పేటలో విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకటరెడ్డి పేటలో ఆదివారం రాత్రి చెట్టు విరిగి కరెంటు వైర్ల పై పడటంతో,మరో ముగ్గురు లైన్మెన్ లతో కలిసి చెట్టును తొలగిస్తుండ గా నాగార్జున ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. దీంతో బొజ్జి గొప్ప గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగార్జున మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి సోమవారం సాయంత్రం అందజేశారు.మృతుడికి ఇద్దరు కుమారులు భార్య ఉన్నారు.