మెగా డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎలాంటి పొరపాట్లు జరక్కూడదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు శివారులోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద శ్రీనివాస బీఎడ్ కాలేజీ, రాఘవేంద్ర బీఎడ్ కాలేజీ లో మెగా డీఎస్సీ 2025 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించి చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డీఎస్సీ వెరిఫికేషన్ కేంద్రాలకు సర్టిఫికెట్ల పరిశీల నిమిత్తం హాజరయ్యే అభ్యర్థులు ఏ చిన్న సమస్య ఎదుర్కొనడానికి వీల్లేదన్నారు.