ఈనెల 12న చందానగర్లో ఖజానా జువెలరీ షోరూంలో దుండగులు చొరబడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు శనివారం మధ్యాహ్నం వివరాలు తెలుపుతూ గుజరాత్ లో ప్రిన్స్ కుమార్ భారతి రోహిత్ కుమార్ రాజాకును అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 900 గ్రాముల వెండి ఆభరణాలు తుపాకిని స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఖజానా జ్యువలరీ డిప్యూటీ మేనేజర్ పై దాడులు జరిపింది రోహిత్ గా గుర్తించామని పోలీసులు అన్నారు.