ఆసిఫాబాద్ మండలంలోని బూరుగూడ ZPHS పాఠశాల చుట్టూ వరద నీరు చేరడంతో బుధవారం పాఠశాలకు విద్యార్థులు హాజరు కాలేదు. భారీ వర్షంతో పాఠశాల అవరణం నీటిలో మునిగిపోవడంతో పాఠశాలకు వెళ్లడానికి దారి లేకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు. అలాగే ఉన్న ఒక్క తరగతి గదిలో సైతం వర్షపు నీరు చేరిందని, పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతోనే వరద నీరు చేరుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్తులు తెలిపారు.