సెట్టూరు మండలం అడవి గొల్లపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు గమనించి వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో గాయపడిన వ్యక్తి వివరాలు తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.