అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజ్పూర్ లో 125 ఎకరాల భూమి కోసం రైతులు సిపిఎం నాయకులతో కలిసి గ్రామపంచాయతీ ముందు సోమవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. 125 ఎకరాల భూమిలో జెండా పాతడానికి రైతులు ప్రయత్నించారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.