ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంపై బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మంత్రి రామకృష్ణ, మండల అధ్యక్షులు దశరథ్, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ లు మండిపడ్డారు. ఆదివారం ఆయన ఖేడ్‌లో మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్న ప్రధాని మోదీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీపై విమర్శలు మానుకోవాలన్నారు.