దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షులు గౌనిప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన రాయదుర్గంలో మాట్లాడుతూ అనర్హుల పెన్షన్లు తీసేస్తే ఎవరూ భాధ పడరని, అర్హులైన దివ్యాంగుల పెన్షన్ తొలగిస్తూ నోటీసులు జారీచేయడంతో దివ్యాంగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు.