తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం ఎప్పటికీ మర్చిపోలేమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. ఐలమ్మ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీరామ్ వెంకట్, విటల్ పాల్గొన్నారు