ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని మెడికల్ షాప్ యజమానులు అసోసియేషన్ నాయకులతో మెడికల్ షాప్ ఎన్ ఆర్ కే డ్రగ్స్ అమ్మకాలపై మరియు నియోగంపై నిర్వర్తించాల్సిన పలు అంశాలపై జిల్లా ఎస్పీ శివకిషోర్ అవగాహన కార్యక్రమం చేపట్టారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వలన అనేక అనర్ధాలు కలుగుతున్నాయని ఆధునిక ప్రపంచంలో దేశానికి వెన్నుముకైనా యువతను మత్తు పదార్థాలకు అలవాటు చేస్తే ఆ దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు.. మెడికల్ షాపుల్లో పనిచేసే సిబ్బంది వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.