కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,757 విగ్రహాలు ( ఆయా సబ్ డివిజన్ లలో కర్నూల్ 612, ఆదోని 143, ఎమ్మిగనూరు 832, పత్తికొండ 1170) నిమజ్జనం జరిగే ప్రాంతాలలో పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించామన్నారు. నిమజ్జనం ప్రాంతాలకు చిన్నపిల్లలు, వృద్దులను దూరంగా ఉంచే విధంగా గణేష్ ఉత్సవ నిర్వహకులు చర్యలు తీసుకోవాలన్నారు.