సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కేంద్రం వరాల జల్లు కురిపించిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వాకటి నారాయణరెడ్డి తెలిపారు. 20 లక్షల లోపు వాహనాలపై జిఎస్టి భారీగా తగ్గించిందని శుక్రవారం వెల్లడించారు. నెల్లూరులోని బిజెపి కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు.