జిల్లాలో రైతులకు యూరియా ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జిల్లాలో అవసరమైనంత మోతాదులో యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఎరువుల దుకాణాలను ఉదయం 8 గంటలకు తెరిపిస్తున్నామని చెప్పారు. రైతులు ఒకేసారి గుంపులుగా దుకాణాలకు వెళ్లకుండా విడతల వారీగా వెళ్లి అవసరమైనంత మేరకు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా కొరతపై అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దని, జిల్లాలోని ప్రతి రైతు అవసరానికి తగ్గట్టుగానే యూరియా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఎరువుల సరఫరా పర్య