కాల్చుకున్న కరెంటుకే బిల్ చెల్లించండి శుక్రవారం సిరిసిల్ల సేస్ కార్యాలయం ముందు పవర్లు యజమానుల బైఠాయింపు నిరసనకు స్పందిస్తూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము బ్యాక్ బిల్లింగ్ గురించి అడగటం లేదని కేవలం ప్రతినెల కాల్చుకున్న కరెంట్ బిల్లు మాత్రమే చెల్లించమంటున్నామని తెలిపారు. 150 పవర్లూమ్ సర్వీసులు ఉన్నాయని ఇందులో 44 మంది యజమానులు మాత్రమే బిల్లులు చెల్లించారని 112 మంది చెల్లించలేదని అన్నారు.