నంద్యాల పట్టణంలో ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా విగ్రహాలను తీసుకువెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ డీఈఈ రమేష్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమజ్జనం మహోత్సవం సందర్భంగా పట్టణంలో ఎలాంటి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా 70 మంది సిబ్బందితో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.