ప్రజల పక్షాన ధైర్య సాహసాలతో పోరాడి అసువులు బాసిన అమరులు బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ ల 25వ వర్ధంతి సందర్భంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు మధురవాడ జోనల్ కార్యాలయం దరి అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమరుల చిత్రపటానికి సిపిఎం నాయకులు ఏ గురుమూర్తి రెడ్డి పువల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు డీ అప్పలరాజు మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వం పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనకు బలైన విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణల త్యాగాలు వృదా కానివ్వమని అన్నారు.