ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి వినాయక విగ్రహాలను ఊరేగింపుగా మండపాలకు తరలించారు. గ్రామాల్లోని ప్రధాన వీధులలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారులు యువకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.