స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటోకార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భీమడోలులో స్థానిక ఆటోయూనియన్ ఆధ్వర్యంలో భారీ ఆటో నిరసన ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం భీమడోలులోని స్థానిక శ్రీవెంకటేశ్వర ఆటోయూనియన్ ఆధ్వర్యంలో ఆటోకార్మికులు భారీ ఆటో నిరసన ప్రదర్శన నిర్వహించారు. భీమడోలు కూడలి నుంచి సాయిబాబాగుడి, గాంధీబొమ్మ సెంటర్, సంతమార్కెట్ మీదగా భీమడోలు జంక్షన్ కు భారీ ఆటో ర్యాలీని 200ఆటోలతో చేపట్టారు. భీమడోలు, గుండుగోలను, పూళ్లకు చెందిన ఆటోకార్మికులు పాల్గొన్నారు. భీమడోలు జంక్షన్ కూడలిలో మానవహారంగా ఏర్పడి తమ నిరసనను వ్యక్తం చేశారు.