శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని వైఎస్ఆర్సిపి శ్రేణులు మంగళవారం నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి మక్బూల్ అహమ్మద్ ఆధ్వర్యంలో పట్టణంలో పార్టీ కార్యాలయం నుంచి వైయస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సీఎంగా ఉన్న సమయంలో చేసిన సేవలను కొనియాడారు.