తాను చేస్తున్న అభివృద్ధిని హైజాక్ చేయాలని అడ్డుకోవాలని ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే, నాలోని అపరిచితుడు బయటకు వస్తాడు అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు భీమవరంలో అభివృద్ధి అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, వాటిని అమలు పరుస్తున్నానని తెలిపారు. శ్రీనివాస్ వర్మ సామాన్యుడిని ఆర్థికంగా గొప్పవాడిని కాకపోయినా తన మార్కు అభివృద్ధి చేస్తున్నానని