రాజీకి అవకాశం ఉన్న కేసులన్నింటినీ పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని గుత్తి సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ చారి న్యాయవాదులకు సూచించారు. గుత్తి ఏ డీ జే కోర్టులో మంగళవారం సమావేశం నిర్వహించారు.హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తామన్నారు. పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో రాజీకి అవకాశం ఉన్న వాటిని పరిష్కారం చేయాలన్నారు. కార్యక్రమంలో బార్ సోసియేషన్ అధ్యక్షులు పీడీ రత్నం, పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.