మధురవాడ పీఎం పాలెం చివరి బస్టాప్ వద్ద సోమవారం ఒక కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.