అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ట్రాలీ ఆటో చక్రాల కింద బాలుడు పడి లోహిత్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వాహనం కింద ఉన్న కుక్కపిల్లను బయటికి తీసేందుకు ప్రయత్నిస్తుండగా బాలుడిని గమనించండి డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో చక్రాల కింద బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.