రానున్న 2027 గోదావరి మహా పుష్కరాలు నేపథ్యంలో ఇప్పటినుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతులు కల్పనా మరియు సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. విధుల్లో చేరిన అనంతరం కలెక్టరేట్లో ఆమె మీడియాతో శనివారం మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లాను సమగ్ర అభివృద్ధి పథంలో నడుపుతానని కలెక్టర్ స్పష్టం చేశారు.