వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ మతసామరస్యంతో జరుపుకోవాలని కర్నూలు రెండో పట్టణ సీఐ నాగరాజు రావు సూచించారు. నేడు శుక్రవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐ నాగరాజు రావు మాట్లాడుతూ, పండుగ సందర్భంలో ఎవరూ అశాంతి కలిగించే చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు నిర్వాహకులు పోలీస్ శాఖ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా శబ్ధ కాలుష్యం, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూడాలని కోరారు. పీస్ కమిటీ సమావేశంలో అధికారులు చేసిన సూచనలు:వినాయక వ