ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులను లబ్ధిదారులకు తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ మంగళవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.29.17 లక్షల విలువగల 44 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గూడూరు నియోజకవర్గంలో వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన నిధులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.