ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని డ్వాక్రా మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కోరారు. మామిడికుదురు మండల పరిషత్ కార్యాలయం వద్ద 23 డ్వాక్రా సంఘాలకు మంజూరైన రూ. 2.30 లక్షల రివాల్వింగ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీఎం వెంకటరమణ, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు