కోవెలకుంట్ల సమీపంలోని నైనాలప్ప ఆలయం వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో అక్కంపల్లి నుంచి నొస్సం వైపుగా వెళ్తుండగా నొస్సం నుంచి కోవెలకుంట్ల వైపు వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఆటో నుజ్జు నుజ్జు అవ్వటంతో అందులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్ ఘటన జరగగానే అక్కడి నుంచి పరారయ్యాడు.