గుంటూరు జిల్లాలో రైతుల దగ్గర నుంచి పొగాకు కొనుగోలు ఆగకూడదని ఇందుకు సంబంధించి, ప్రభుత్వంతో పాటు ప్రతి ప్రైవేట్ కంపెనీలు కూడా రైతుల దగ్గర కొనుగోలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల డి.ఆర్.సి హాల్లో హెచ్.డి.బి.ఆర్.జి పొగాకు కొనుగోలు చేస్తున్న ప్రయివేట్ కంపినీలు, రైతులు మరియు రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్. డి. బి. ఆర్. జి పొగాకు కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక పై చర్చించారు.జిల్లాలో సుమారు 3985 మంది రైతులు పొగాకు సాగు చేశారని తెలిపారు.