పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు ఎన్ఎస్పి కాలంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మండల పరిధిలోని చీమలమర్రి గ్రామానికి చెందిన సురభి సీతమ్మ 75 సంవత్సరాలు చల్లగుండ్ల కెనాల్ లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మృతదేహం ఎన్ఎస్పి కాలువలో లభ్యమైందని నకరికల్లు ఎస్సై సిహెచ్ సురేష్ వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.