విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరిలో కృష్ణ అనే వ్యక్తి పెంచుకున్న శునకం అనారోగ్యంతో మృతి చెందింది. దానికి హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరిపారు. దశ దిన కర్మలు నిర్వహించి భోజనాలు కూడా పెట్టారు. దీంతో పెంపుడు శునకంపై వారికున్న అభిమానానికి చూసిన వారి కళ్లు చెమర్చాయి. అతి గారాబంగా పెంచుకున్న చిట్టి చనిపోవడంతో వారి ఇంటిలో విషాదఛాయలు అలముకున్నాయి.