బుధవారం వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను అకస్మికంగా సందర్శించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురవి ఈ సందర్భంగా పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ ను సందర్శించి అందులో అందిస్తున్న శిక్షణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల టైం టేబుల్ ను పరిశీలించారు కంప్యూటర్ విద్యను అందిస్తున్న తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు కంప్యూటర్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉందా అనే అంశంపై వివరాలను అడిగి తెలుసుకుని నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.