అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో డిఆర్డిఏ, డ్వామా శాఖల అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో మొబిలైజేషన్ ప్రణాళిక శక్తివంతంగా, పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభలో పాల్గొనేందుకు అత్యంత భారీస్థాయిలో ప్రజలు వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ప్రణాళికను గూగుల్ షీట్ లో ఎక్కించాలన్నారు.