వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాలలో నిర్వాహకులు జాగ్రత్తలు వహించాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ దమ్మ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన సంగారెడ్డి జిల్లా కంగ్టి సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిజె సౌండ్ లు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శాంతియుత వాతావరణం లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయాలని సూచించారు.