విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఐక్యమత్యంతో కురుబలు మెలగాల్సిన అవసరముందన్నారు. అమరావతిలో భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగిరిలో ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కురుబ, కురువ, కురుమ సామాజిక వర్గీయుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. కురుబ, కురుమ, కురువ సామాజిక వర్గీయుంతా ఒక్కటేనని, వారంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.