సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని అల్లిపూర్ లో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. శనివారం సాయంత్రం అల్లిపూర్ శివారులో పేకాట ఆడుతున్నారన్న నమ్మదిగిన సమాచారంతో ఎస్సై వినయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న మన్నారు. వారి వద్ద నుండి 1400 రూపాయలు నగదు, మొబైల్ ఫోన్లు, మూడు బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.