చెత్త సేకరణలో సరైన పనితీరు కనబరచకపోవడంతో రాశా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం టీసులు జారీ చేసింది. క్లోజ్డ్ కాంపాక్షన్ సిస్టం ద్వారా చెత్తను తరలించే బాధ్యత ఈ సంస్థకు అప్పగించారు. అయితే, సంస్థపై అనేక ఆరోపణలు రావడంతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నిఘా పెట్టి ఒక నివేదిక తెప్పించుకున్నారు. విచారణలో ఆ సంస్థ టెండర్‌లోని నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో కాంట్రాక్ట్ రద్దు నోటీసులు జారీ చేయడంతో పాటు, ఆ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు జీవీఎంసీ సిద్ధమవుతోంది.